Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

మీకు పోర్న్‌ వీడియోలు చూసే అలవాటుందా... అయితే మీపై నిఘా ఉన్నట్టే!

  • గూగుల్‌, ఫేస్‌బుక్‌లు పక్కాగా మీపై కన్నేసి ఉంచాయి
  • మీరు చూసే ప్రతి వీడియో సమాచారం వారి చేతికి
  • థర్డ్‌ పార్టీ సంస్థలకు యూజర్‌ డేటా లీక్‌
ఇంటర్నెట్‌లో అశ్లీల వీడియోలు చూసే అలవాటు మీకు ఉందా?. ఎవరూ లేనప్పుడు, గుట్టుచప్పుడు కాకుండా పోర్న్‌ వీడియోలు చూసేస్తున్నానని సంబరపడిపోతున్నారా? అయితే మీరు పప్పులో కాలేసినట్టే. మీపై నిరంతర నిఘా కొనసాగుతోందన్న విషయం గుర్తు పెట్టుకోండి అంటున్నారు పరిశోధకులు. గూగుల్‌, ఫేస్‌బుక్‌, ఒరాకిల్‌ క్లౌడ్‌లు మీరు చూసే ప్రతి పోర్న్‌ వీడియో, సైట్‌నే కాదు నెట్‌లో మీ ప్రతి కదలికను గమనిస్తున్నాయని మైక్రోసాఫ్ట్‌, కార్నెగొ మెల్లన్‌ యూనివర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్‌ పెన్సిల్వేనియా పరిశోధకులు సంయుక్తంగా చేసిన అధ్యయనంలో తేల్చారు.  ‘వెబ్‌ ఎక్స్‌రే’ అనే టూల్‌ సాయంతో 22,484 అశ్లీల వెబ్‌సైట్లు పరిశీలించినప్పుడు 93 శాతం పేజీలు ట్రాకింగ్‌కు గురైనట్లు గుర్తించారు.

2017లో 30 బిలియన్ల మంది పోర్న్‌ సైట్లు చూశారని, ఆశ్లీల సైట్ల కోసం వెతికే వారి సంఖ్య ప్రతి సెకనుకు 50 వేల వరకు ఉందని ఈ సంస్థలు తేల్చాయి. నెట్‌ ట్రాఫిక్‌లో మూడింట ఒక వంతు ట్రాఫిక్‌ అశ్లీల సైట్లదేనని గుర్తించారు. ఆన్‌లైన్‌ మార్కెట్‌ దిగ్గజాలు నెట్‌ఫ్లిక్స్‌, అమెజాన్‌, ట్విట్టర్‌ మూడింటి ట్రాఫిక్‌ కంటే ఆరు రెట్లు అధికంగా పోర్న్‌సైట్ల ట్రాఫిక్‌ ఉందట.

అంతేకాదు థర్డ్‌ పార్టీ సంస్థలకు యూజర్‌ డేటా లీక్‌ అవుతున్నట్లు కూడా గుర్తించారు. గూగుల్‌ మరియు దాని అనుబంధ సంస్థలు దాదాపు 75 శాతం పోర్న్‌ సైట్లు, ఒరాకిల్‌ 25 శాతం, ఫేస్‌బుక్‌ 10 శాతం సైట్లపై నిఘాపెట్టినట్లు పరిశోధనలో తేలింది.
porn sites
google
Facebook
data leake

More Telugu News